
నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి
నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి
కాలువ నీటిని విడుదల చేయాలని రోడ్డెక్కిన రైతన్న

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 22 (ప్రజా కలం)కాలువ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మెట్ పల్లి, వెల్లుల్ల, బండ లింగాపూర్, పెద్దాపూర్, రేగుంట, ఇబ్రహీంపట్నం రైతులు మంగళవారం మెట్ పల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఎస్సారెస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన రైతులు అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్సారెస్పీ కాలువ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఖరీఫ్ సాగుకు సరిపడా వర్షాలు లేక వరి నారు, పసుపు, మొక్క జొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 20 రోజులుగా నీటి పారుదల శాఖ అధికారులకు విన్నవించుకున్నా నీరు విడుదల చేయడం లేదని వాపోయారు.

ఉప్పు లూర్ గ్రామంలోని గేట్లను ఎత్తి దిగువ రైతులకు నీరు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకొని రైతుల డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆందోళన విరమింప చేయాలని సూచించారు. దీంతో రైతులు ఆందోళన విరమించడంతో ఇరువైపులా రాకపోకలు కొనసాగాయి.


