
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వర్ధంతి వేడుకలు
కాల్వశ్రీరాంపూర్,జూలై 04:(ప్రజాకలం ప్రతినిధి)మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఎంపీడీవో పూర్ణచందర్రావు తన సిబ్బందితో కలిసి ఘన నివాళులర్పించారు.రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో పూర్ణచందర్రావు మాట్లాడుతూ కొనజేటి రోశయ్య ఆదర్శవంతమైన జీవితం గడిపాడని, అంచె లంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన మహనీయుడని రోశయ్య సేవలను కొనియాడారు.రోశయ్య ముఖ్యమంత్రిగా పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, రాష్ట్రంలో అద్భుత ప్రగతిని సాధించారన్నారు.కార్యక్రమంలోఎంపీడీవోతో పాటు సీనియర్ అసిస్టెంట్ రంగు రవి, ఏపీఎం మంజుల, టీఎ శ్రీనివాస్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
TAGS Hot News

