*ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన*

*ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన*

*ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన*
చిగురుమామిడి,జూలై 04:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.శ్రీనివాస విజన్ సెంటర్,అక్షర ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.ఈ వైద్య శిబిరంలో దాదాపు 200 మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.పరీక్షల అనంతరం శుక్లాల ఆపరేషన్ అవసరమైన 19 మందిని ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు కంటి పరీక్షల నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు.గ్రామీణ ప్రాంత ప్రజలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ శిబిర నిర్వహణలో బుర్ర శ్రీనివాస్ గౌడ్,జక్కుల బాబు,ముంజ ప్రకాష్ గౌడ్,బండి ఆదిరెడ్డి,జక్కుల స్వామి, పచ్చిమట్ల అజయ్ కుమార్ గౌడ్,రాజు గౌడ్,ముత్యాల మహేందర్,కక్కర్ల సంపత్ కుమార్ తో పాటు వైద్య సిబ్బంది పాలుపంచుకున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )