వినాయక నిమజ్జనం శనివారం రోజున జరుపుకోవాలి
మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 03 (ప్రజా కలం) వినాయక నిమజ్జనం శనివారం రోజున జరుపుకోవాలని మెట్టుపల్లి ఆర్డీవో నక్క శ్రీనివాస్ అన్నారు. బుధవారం రోజున
గణపతి నిమజ్జనం నకు సంబంధించి మెట్ పల్లి ఆర్డీవో ఎన్. శ్రీనివాస్ డిఎస్పీ శ్రీరాములు , మెట్ పల్లి తహసీల్దార్ శ్రీమతి నీత మరియు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ సంయుక్తంగా గణేష్ నిమజ్జనం చేయుట కొరకు సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకొని తేదీ: 06-09-2025 శనివారం రోజున గణేష్ నిమజ్జనం మెట్ పల్లి పట్టణంలో జరుపుకోవాలని నిర్ణయించడం జరిగినది.
కావున మెట్ పల్లి పట్టణంలో ఉన్న గణేష్ మండపాల నిర్వహకులు ఇట్టి విషయాన్ని గమనించగలరని కోరడమైనదనీ వారు అన్నారు
CATEGORIES తెలంగాణ
TAGS Hot News

