
తల్లిదండ్రులను పట్టించుకోలేదని గిఫ్ట్ డీడ్ రద్దు*
భూమి రాసిచ్చినంక తల్లిదండ్రులను పట్టించుకొని కుమారుడు
యాదాద్రి జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించిన కందాడి జనార్దన్ రెడ్డి
*యాదాద్రి/వలిగొండ నవంబర్ 21 ప్రజాకలం*:వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ కందాడి జనార్దన్ రెడ్డి 80 సంవత్సరాలు అనే వ్యక్తి 2024 సంవత్సరంలో తన కుమారుడుకి 18 ఎకరాల 16 గుంటల భూమిని దాన పూర్వకంగా గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగింది.కానీ తనని చూడట్లేదని,బాగోగులు పట్టించుకోవట్లేదని,కందాడి జనార్దన్ రెడ్డి మెయింటెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్/సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007 లోని సెక్షన్ 23 ప్రకారం అట్టి 18 ఎకరాల 16 గుంటల స్థలం గిఫ్ట్ డీడ్ ని రద్దు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోగా సుదీర్గ వాదోప వాదనలు విన్న తర్వాత సీనియర్ సిటిజన్స్ అయిన తల్లిదండ్రులను చూసుకోవట్లేదని,నిర్ధారణ అయినందున అట్టి 18 ఎకరాల 16 గుంటల భూమి గిఫ్ట్ సీడ్ ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు రద్దు చేశారు.తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత అని,అది విస్మరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు.

