ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.

అయ్యా… చేతులు జోడించి వేడుకుంటున్న…
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు..
ఆసుపత్రులకు పేర్లు పెట్టుకున్న అభ్యంతరం లేదు
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి డిసెంబర్ 03 (ప్రజా కలం) అయ్యా. ముఖ్యమంత్రి గారు.. చేతులు జోడించి వేడుకుంటున్న ప్రజారోగ్యం పై ఇంత నిర్లక్ష్యమా..పేదల ఆరోగ్యం అంత అలుసా, నిర్లక్ష్యం వద్దని, మెటపల్లి ఆసుపత్రిని ఆధునీకరణ చేసి మీ పేర్లు పెట్టుకున్న తనకు అభ్యంతరం లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అభివృద్ధి ని పక్కన పెట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ సంబరాలపై అసహనం వ్యక్తం చేశారు.బుధవారం మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంబరాల్లో మునికి తేలుతుందని, కానీ ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన కష్టాలు మాత్రం ఎవరూ పట్టించుకోలేదని ఎమ్మెల్యే సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.గత రెండు సంవత్సరాలుగా అసెంబ్లీలోనూ, సమావేశాల్లో స్పష్టంగా చెబుతున్నానన్నారు. మెట్పల్లి, కోరుట్ల ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కానీ ప్రభుత్వం మాత్రం సంబరాల్లో మునిగిపోయిందన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 90 శాతం పూర్తయిన ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్కూల్స్, రోడ్లు ఇవన్నీ నేటికీ అన్నీ అర్థాంతరంగా ఆగిపోయాయయని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రి తీవ్రంగా పాడైపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. శ్రద్ధ తీసుకునే పరిస్థితి లేదు పెచ్చులు ఊడిపోతున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వసతులు వెంటనే కల్పించండి. ఆసుపత్రిలో ఎక్విప్మెంట్లు, పెయింటింగ్, స్టాఫ్ అన్ని పెండింగ్ లో ఉన్నాయని, తక్షణమే పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.అవసరమైతే ఈ ఆసుపత్రికి పేర్లు పెట్టుకోండి…కానీ హాస్పిటల్ ప్రజారోగ్యం పై అశ్రద్ధ వద్దన్నారు.త్వరగా పూర్తవ్వాలని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడలన్నారు.కొత్త పథకాలు ప్రకటించకపోయినా పర్లేదు…


కానీ కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను అయినా పూర్తి చేయండని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోడ్లు లేవు, డ్రైనేజీలు దారుణంగా ఉన్నాయన్నారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు అర్థాంతరంగా ఆగిపోయాయని,స్కూల్స్, హాస్పిటల్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోందన్నారు.ఇంత దుస్థితి ఉన్నప్పటికీ మీరు కొత్తగా ‘ఏ వన్, సిటీ – పోర్త్ సిటీ’ నిర్మిస్తామని చెబుతున్నారని వాపోయారు.ముందు ఉన్న పట్టణాలు కాపాడండి… తర్వాత కొత్త కలలు కనండని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వానికి హితవు పలికారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )