
దారి ఇలా… పోయేదెలా..!?
దారి ఇలా… పోయేదెలా..!?
పట్టించుకోని అధికారులు
రోడ్డుపైన ఇసుక కంకర
ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 26 (ప్రజా కలం) పట్టణంలోని 20 వార్డులో రోడ్డుపైనే కంకర పోసి ,ఇసుక పోసి వాహనదారులకు రాకపోకలకు ఇబ్బంది కలగ చేస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు
వివరాలకు వెళ్తే పట్టణంలోని 20వ వార్డులో నిర్మిస్తున్న ఇంటికి సంబంధించిన ఇసుక కంకర గృహ నిర్మాణానికి కావలసిన సరుకులు ప్రతిదీ రోడ్డుపైన వేసి వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పట్టణంలోని 20వ వార్డులో నివాసం ఉంటున్నటువంటి కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. స్కూలుకు వెళ్లడానికి పిల్లలకు ఇబ్బంది అవుతుందని, టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తక్షణమే స్పందించి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని 20 వార్డు కాలనీవాసులు మున్సిపల్ సిబ్బందిని వేడుకుంటున్నారు

