
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలి
*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ బి. సత్య ప్రసాద్*
మెట్ పల్లి: కోరుట్ల ప్రతినిధి జులై 01(ప్రజా కలం)
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులకు సూచించారు. ఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు పనులు లను ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోయిన లబ్దిదారులను కలిసి, వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక తోడ్పాటు గురించి వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు. నిర్దేశిత గడువు లోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ పలుకరించి, ఇంటి నిర్మాణానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. నిర్మాణాలను పనులను వేగంగా పూర్తి చేసుకోవాలని, వివిధ దశలను అనుసరిస్తూ వెంటదివెంట డబ్బులను ఖాతాలో జమ చేయిస్తామని అన్నారు.
కలెక్టర్ వెంట. మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి నక్క శ్రీనివాస్ ,ఎంపీడీవో మహేశ్వర్ రెడ్డి,ఎమ్మార్వో కె.శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు

