
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ ఇసుక వ్యాపారం
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ ఇసుక వ్యాపారం
అనుమతులు కొంత…తొవ్వేది కొండంత
వలిగొండ జూలై 12 ప్రజాకలం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో ఇసుకసురులు రెచ్చిపోతున్నారు…నిరుపేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పుడూ…? ఎలా పూర్తి అవుతుందో…? ఎంత ఖర్చు అవుతుందోనని ఓ వైపు లబ్దిదారులు ఆందోళన చెందుతుంటే,వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరులో కొంత మంది ఇసుక వ్యాపారులకు మాత్రం ఈ పథకం కాసుల వర్షం కురిపిస్తున్నాయి..ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను పంపిణీ చేయాలని సూచిస్తూ తరలింపునకు అనుమతులు ఇస్తుంటే,ఇక ఇదే అదునుగా భావిస్తున్న ఇసుక వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమైనారు.దీంతో ప్రభుత్వ ఆదాయానికే కాదు లబ్దిదారుల ఆశలకు ఇసుక వ్యాపారులు గండి కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకే అనుమతి పత్రంపై పదుల సంఖ్యలో రవాణా..*
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉండొద్దనే మండల రెవెన్యూ అధికారులు ఇసుక తరలింపునకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఒక్కొక్క అనుమతి పత్రంతో నాలుగు ట్రిప్పుల ఇసుకను మాత్రమే తరలించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఇసుక వ్యాపారాలు మాత్రం రెవెన్యూ అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కు తూ నాలుగు ట్రిప్పులు ఇందిరమ్మ ఇళ్లకు,మరో నాలు గు ట్రిప్పులు బయటకు తరలిస్తూ,ఒక్కో అనుమతిపై పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.

