
ఇందిరమ్మ చీరలకు రాజకీయ రంగు..
రేగుంట గ్రామం లో చీరల పంపిణీ కార్యక్రమంలో వివాదం..
మల్లాపూర్ నవంబర్ 25 ( ప్రజా కలం ప్రతినిధి)
ఇందిరా మహిళా శక్తి లో భాగంగా రేగుంట గ్రామంలో రసాభాస చోటు చేసుకుంది. మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద చీరల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా సంఘం భవనం లేదా గ్రామపంచాయతీ కార్యాలయం లాంటి ప్రభుత్వ ప్రదేశాల్లో కాకుండా, స్థానికంగా ఒక్క షట్టర్ రూమ్ లో చీరలు పంపిణీ చేస్తున్నారని గ్రామంలోని పలువురు మహిళలు ఆరోపించారు.
తమకు నచ్చిన వారికే చీరలు అందజేస్తూ వివక్ష చూపుతున్నారని మహిళలు ఆరోపించడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మండల ఎంపీడీఓ శ్రీకాంత్ రేగుంట గ్రామాన్ని పరిశీలించేందుకు చేరుకున్నారు. ఎంపీడీఓ గ్రామానికి రాగానే ఆగ్రహించిన మహిళలు, గ్రామస్తులు గ్రామపంచాయతీ ఆవరణలో ఆయనను ముట్టడిస్తూ చీరాల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరగాలని సమస్యలను వివరించారు. ఎంత సముదయించిన మహిళలు వినకపోవడం తో ఎంపీడీవో తిరిగి వెళ్ళిపోవడం వివాదం కాస్త ఇంకా చెలరేగినట్టు అయింది.


