
భూభారతి రిజిస్ట్రేషన్ లో అక్రమాలు
భూభారతి రిజిస్ట్రేషన్ లో అక్రమాలు
* సాంకేతికత దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు..
* వలిగొండలో ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
వలిగొండ జనవరి 13 ప్రజాకలం:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన, భూ భారతి రిజిస్ట్రేషన్ లావాదేవీలలో తక్కువ స్టాంపు డ్యూటీ చెల్లించిన కేసులను ధ్రువీకరించాలని,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశానుసారం,వలిగొండ మండలంలోని భూ భారతి ఆపరేటర్లు కలకూరి మధు, భువనేష్,బసవరాజు,రాజు, రాకేష్,శివరామకృష్ణ,తరుణ్ అనే వ్యక్తులు భూ భారతి రిజిస్ట్రేషన్ లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి తక్కువ చూపించినందుకు చర్యలు తీసుకోవాలని,వలిగొండ మండల తహసిల్దార్ దశరథ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.భూభారత రిజిస్ట్రేషన్ లో మొత్తం ఇట్టి వ్యక్తుల నుంచి 15 లక్షల 58,472 రూపాయలు తప్పుడుగా నమోదు చేయడంతో వీరిపై పలు సెక్షన్లు 316(2), 316(5), 336(3), 337, 338, 340(2), 318(4), 111(2)(3)(6), 61(2) రెడ్ విత్ 3(5) BNS మరియు ఐటీ చట్టంలోని సెక్షన్ 66(D) కింద క్రైమ్ నెం. 10/2026లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు,వలిగొండ ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.

