నగల వ్యాపారులు భద్రత చర్యలు పాటించాలి

నగల వ్యాపారులు భద్రత చర్యలు పాటించాలి

మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 23 (ప్రజా కలం)నేరాల నియంత్రణకు బంగారు దుకాణ యజమానులు తీసుకోవలసిన భద్రత చర్యలు చేపట్టుకోవాలని మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ తెలిపారు.మెట్ పల్లి పట్టణంలోని బంగారం, వెండి వ్యాపారస్తులతో బుధవారం నాడు మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సమావేశంను నిర్వహించారు. పట్టణంలో దొంగతనాలు, నేరాలు నివారించుటలో భాగంగా మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్ ఐ కిరణ్ కుమార్ లు పట్టణంలోని బంగారం దుకాణాల పరిసర ప్రాంతాలన్నీ అత్యాధునిక సిసి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విలువైన నగలను కాపాడనుకునేందుకు ముందస్తు చర్యలను వివరించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులందరు అత్యాధునిక సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. కార్యక్రమంలో బంగారం షాప్ ల వర్తక సంఘం అద్యక్షుడు బెజ్జారపు నవీన్ కుమార్, వారి సంఘ సభ్యులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )