చెరువులో ఎకరం కబ్జా చేసి విల్లా కట్టిన వైనం

చెరువులో ఎకరం కబ్జా చేసి విల్లా కట్టిన వైనం

అద్దెదారులను బెదిరిస్తు ప్రైవేట్ బౌన్సర్లతో అడ్డుకుంటున్న
కోకాపేట జ్రేష్ఠ విల్లాస్‌ సొసైటీ సభ్యుల
చెరువులో ఎకరం కబ్జా చేసి విల్లా కట్టిన వైనం
మాకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు వాపోయిన
విల్లాలో నివసించే దేశ్ కాంత్ రెడ్డి
రాజేంద్రనగర్,ఆగస్టు 02,(ప్రజా కలం)
రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఉన్న జ్రేష్ఠ విల్లాస్‌లో నివసించే అద్దెదారులపై సొసైటీ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని అద్దెదారులను బెదిరిస్తూ, ప్రైవేట్ బౌన్సర్లతో అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో జరిగిన ఒక వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.వివరాల్లోకి వెళ్తే, విల్లాలో నివసించే దేశ్ కాంత్ రెడ్డి, తరచు పవర్ కట్ చేయడం, పని మనుషులను ఇంట్లోకి రాకుండా గేటు వద్ద అడ్డుకోవడం వంటి అంశాలపై సొసైటీ సభ్యులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సొసైటీ నాయకుడు విక్రాంత్, దేశ్ కాంత్ రెడ్డిపై మీడియా ముందే బూతులు తిడుతూ, దాడికి యత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో జేష్ఠ విల్లాస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.


*సొసైటీ సభ్యులపై మరిన్ని ఆరోపణలు
విద్యుత్ దొంగతనం కమర్షియల్ మీటర్లు ఉండాల్సిన చోట రెసిడెన్షియల్ మీటర్లు పెట్టి, పెద్ద ఎత్తున విద్యుత్ దొంగతనానికి పాల్పడుతున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కోల్పోతోందని ఆరోపణలు ఉన్నాయని విల్లా వెనుక వైపు ఉన్న ఒక ఎకరం చెరువు భూమిని అక్రమంగా కబ్జా చేసి, అక్కడ స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారని బాధితులు తెలిపారు.


పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనలపై ఇరు వర్గాల వారు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అద్దెదారు దేశ్ కాంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని మీడియా ముందు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )