రుణమాఫీ చేసిన నిధులను చేనేత కార్మికుల అకౌంట్లో వేయాలి

రుణమాఫీ చేసిన నిధులను చేనేత కార్మికుల అకౌంట్లో వేయాలి

చేనేత కార్మికులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి
చేనేత కార్మికుల పని లేక తినడానికి తినలేక ఇబ్బంది పడుతున్న వైనం
చేనేత కార్మికులకు తక్షణమే లక్ష రూపాయలు మంజూరు చేయాలి
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి
పోచంపల్లి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 04, (ప్రజా కలం)
రాష్ట్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం చేనేత కార్మికులకు రుణమాఫీ ఆమోటు లక్ష రూపాయలను చేనేత కార్మికుల అకౌంట్లో వేయాలని భూదాన్ పోచంపల్లి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని చేనేత కార్మికులు గిరాకీ లేక చేయడానికి పని లేక తినడానికి తినలేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ప్రభుత్వ స్పందించి చేనేత కార్మికుల బ్యాంక్ అకౌంట్ లో లక్ష రూపాయలు నిధులు మంజూరు చేయాలని అంకం పాండు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల ఎన్నో సమస్యలతో పోరాటపుతున్నారని పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం వాదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తెలుసుకొని సమస్యలు తీర్చడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా లక్ష రూపాయలను బ్యాక్ అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ప్రభుత్వం చేనేత కార్మికులకు 2 లక్షల రుణ మాఫీ చేసి కొత్త రుణాలు 2 లక్షల వరకు కార్మికులకు ఇచ్చే ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, ఉపాధ్యక్షుడు భారత భూషణం, ప్రధాన కార్యదర్శి బొమ్మరి శంకర్, సహాయ కార్యదర్శి బిట్ల గణేష్,కోశాధికారి రుద్ర సూర్యప్రకాష్, కటకం శ్యాంసుందర్, పుట్టపర్తిని వేణు, గుండు శివరాజు, కూరపాటి భాస్కర్, గుడ్డేటి శివరాజ్ గుండు రాజేశ్వరి హేమలత, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు,

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )