
మల్లాపూర్ లో దారుణం..
వ్యక్తి దారుణ హత్య…
మల్లాపూర్ నవంబర్ 26 ( ప్రజా కలం ప్రతినిధి)
మల్లాపూర్ మండల కేంద్రంలో వ్యక్తి హత్య స్థానికంగా సంచలనం రేపుతోంది. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య (52) ను కత్తితో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే మల్లయ్యను భార్యే హతమార్చినట్టుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
TAGS Hot News

