ఖమ్మంలో మాంగళ్య షాపింగ్ మాల్ 30వ శాఖ ప్రారంభం

ఖమ్మంలో మాంగళ్య షాపింగ్ మాల్ 30వ శాఖ ప్రారంభం

ఖమ్మంలో మాంగళ్య షాపింగ్ మాల్ 30వ శాఖ ప్రారంభం

ఖమ్మం మార్చి 13 ప్రజాకలం ప్రతినిధి…: వస్త్ర వ్యాపార రంగంలో వేగంగా విస్తరిస్తున్న మాంగళ్య షాపింగ్ మాల్ ఖమ్మంలో తన 30వ శాఖను ఘనంగా ప్రారంభించింది. 2012లో వరంగల్‌లో ప్రారంభమైన సంస్థ నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందుతోంది.

సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మాంగళ్య యాజమాన్యం వస్త్ర వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవంతో మూడు రాష్ట్రాల ప్రజలకు సేవలందిస్తున్నారని అభినందించారు. సంస్థ నిర్వాహకులు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ బ్రదర్స్ కలిసి కృష్ణార్జునుల్లా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. త్వరలో తమిళనాడులో కూడా విస్తరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

ప్రముఖ సినీనటి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై దీపప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని విభాగాలను సందర్శించి అభిమానులతో మమేకమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఉత్సాహభరిత వాతావరణం నెలకొల్పారు.

రిబ్బన్ కటింగ్ అనంతరం శ్రీలీల మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌కు మంచి ఆదరణ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో మాల్ మరింత విజయవంతం అవుతుందని తెలిపారు.

మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే తమ లక్ష్యమన్నారు. స్వంత హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులను ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్‌లకు అనుగుణంగా రూపొందిస్తూ వస్త్ర వ్యాపారంలో ముందంజలో కొనసాగుతున్నామని తెలిపారు.

మాల్‌లో మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్లు, వివాహాలు, శుభకార్యాలకు ప్రత్యేక వెడ్డింగ్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.99 నుంచి రూ.1 లక్ష వరకు ధరల శ్రేణిలో వస్త్రాలు లభ్యమవుతున్నాయి. దీంతో ఇది సంపూర్ణ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌గా గుర్తింపు పొందుతోంది.

ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య షాపింగ్ మాల్ రాబోయే రోజుల్లో రాష్ట్రాల్లోనే 9–10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో తమిళనాడులో కూడా విస్తరణ చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో డైరెక్టర్లు విశాల్, వరుణ్, కార్తిక్, అరుణ్, పనీత్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )