
తీగ తెగింది.. రిజిస్ట్రేషన్ ఆగింది..!
తీగ తెగింది.. రిజిస్ట్రేషన్ ఆగింది..!
తెగిన తీగను సరిచేయని అధికారులు
ఇబ్బందులకు గురైన ప్రజలు

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 18 (ప్రజా కలం) పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ కు సంబంధించిన తీగ తెగింది. ఉదయం పూట కార్యాలయానికి వచ్చిన అధికారులు తెగిన ఇంటర్నెట్ కు సంబంధించిన తీగను సరి చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యారు. ఉదయం పూట నుండి సాయంత్రం వరకు అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు జరగవలసిన భూముల రిజిస్ట్రేషన్లు, మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, చాలా దూరం ప్రాంతాల నుంచి వచ్చినామని, రోజంతా రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందరే పడిగాపులు పడిన అధికారులు ఇంటర్నెట్ కు సంబంధించిన తీగను సరి చేయలేదని వచ్చిన ప్రజలు వాపోయారు.

పై విషయమై సబ్ రిజిస్టర్ ను ప్రజా కలం వివరణ కోరగా తీగ తెగిన మాట వాస్తవమే నేను పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది రేపటి లోపు తెగిన తీగను సరి చేస్తామని అన్నారు

