
ఎన్నికల ముందు హామీని నిలబెట్టుకోండి లేదా గద్దె దిగండి
*ఎన్నికల ముందు హామీని నిలబెట్టుకోండి లేదా గద్దె దిగండి
*ఎమ్మార్పీఎస్, వి హెచ్ పి ఎస్ నాయకులు*
*మల్కాజిగిరి,సెప్టెంబర్ 15 (ప్రజా కలం ప్రతినిధి)*
వికలాంగులకు,పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ అందించాలని లేదా పదవుల నుంచి దిగిపోవాలని వీహెచ్ పి ఎస్,ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్,విహెచ్ పి ఎస్ అధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపులో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు వినయ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి తహసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమానికి జాతీయ నాయకులు జిల్లా ఇన్చార్జ్ లక్ష్మణ్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు రామచందర్ మాదిగ,ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మల్కాజిగిరి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సంఘ నాయకులు, పెన్షన్ దారులు మహిళతో కలిసి పెన్షన్ పెంచి అందించాలని నినాదాలు చేశారు.తర్వాత తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ దారులకు 2వేల నుండి 4వేలు పెన్షన్ను అందిస్తామని, వికలాంగులకు 4 వేలనుండి 6వేల రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి దారుణమని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటంతో గతంలో ఇంత పెన్షన్ సాధించుకున్నామని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు మందకృష్ణ మాదిగని వారి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ అందించాలని లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని అన్నారు.పెన్షన్ దారులు, నూతనంగా పెన్షన్ అప్లై చేసుకున్న వారు రాష్ట్రంలో దాదాపు కోటి మంది ఉంటారని వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే 2 కోట్ల మంది వరకు రాష్ట్రంలో ఓటర్లుగా ఉన్నారని రానున్న లోకల్ బాడీ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ను అందించకుంటే, వికలాంగుల,పెన్షన్ దారుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని రానున్న దసరా పండుగ కు ప్రభుత్వం వీరికి శుభవార్తగా పెన్షన్ పెంచి అందిస్తుందని కోరుకుంటున్నామన్నారు. లేనిపక్షంలో రానున్న రోజులలో ఉద్యమాన్నితీవ్రతరం చేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ మార్గంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా వెనకాడ మని అది ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బచ్చలకూర సురేష్,కలుమూరి వెంకటేష్, గజ్జెల్లి రామచందర్, విహెచ్ పి ఎస్ నాయకులు బి.రజిత ,ఎం. వెంకటేష్,రాముకు యాదవ్, ఎస్.గణేష్,ఆర్.మల్లేష్,కె బి. జయహరి,కౌసర్ బేగం, షహీన్,హరిత,ఈశ్వర్ గౌడ్, మున్ని తదితరులు పాల్గొన్నారు.

