దక్షిణ సంభాషణ” స్వర్ణోత్సవ ఉత్సవానికి హైదరాబాద్‌లో భవ్య ఆతిథ్యం

దక్షిణ సంభాషణ” స్వర్ణోత్సవ ఉత్సవానికి హైదరాబాద్‌లో భవ్య ఆతిథ్యం

“దక్షిణ సంభాషణ” స్వర్ణోత్సవ ఉత్సవానికి హైదరాబాద్‌లో భవ్య ఆతిథ్యం
అధికార భాషా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు
హైదరాబాద్, జూలై 10 (ప్రజా కలం):
కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన అధికార భాషా విభాగం 50 ఏళ్ల ప్రస్థానాన్ని జరుపుకుంటున్న వేళ, స్వర్ణోత్సవ కార్యక్రమాల క్రమంలో “దక్షిణ సంభాషణ” పేరిట మరో విశిష్ట సభను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ మహోత్సవం జూలై 11వ తేదీన శుక్రవారం, గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరగనుంది.
ఈ సందర్భంగా ఇవాళ సీజీవో టవర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అధికార భాషా విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షి జాలీ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) హైదరాబాదు అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతిపాటిల్ ఐఐఎస్ సమన్వయం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి గౌరవనీయ కిషన్ రెడ్డి గారు హాజరుకానున్నారు.
అలాగే రాజ్యసభ ఉపసభాపతి శ్రీ హరివంశ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక అతిథులుగా పాల్గొననున్నట్లు డాక్టర్ జాలీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి అధికారులే కాకుండా, భాషా పండితులు, విద్యావేత్తలు, భాషాప్రియులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
క్రీడా పోటీల విజేతలకు ఘన సన్మానం:
స్వర్ణోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలను ఈ సభలో సన్మానించనున్నట్టు డాక్టర్ జాలీ వెల్లడించారు. ఇది కేవలం భాషా పరిరక్షణ మాత్రమే కాక, సాంస్కృతిక రంగంలోనూ విభాగం చొరవ తీసుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది.
నేపథ్యం:
భారతదేశంలో అధికార భాషా విధాన అమలును బలపరిచే క్రమంలో దేశవ్యాప్తంగా టౌన్ అధికార భాషా అమలు కమిటీలు (TOLICs) ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. హిందీ భాషను ప్రాంతీయ భాషల సరసన సంయోజక భాషగా ఉపయోగించాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకుసాగుతోంది.
“దక్షిణ సంభాషణ” ఉత్సవం ఈ నినాదానికి నిదర్శనం. ఇది దక్షిణ భారతదేశం భాషా సమైక్యతలో తన పాత్రను ఘనంగా చాటుకునే వేదికగా నిలవనుంది. హిందీని భద్రంగా ప్రతిష్టించడమే కాక, భారత భాషల మైత్రిని ప్రోత్సహించే వేదికగా ఈ ఉత్సవం నిలవనుంది.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )