బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్‌ పై ప్రత్యేక దృష్టి సారించాలి
మహిళల భద్రతకు ప్రాధాన్యం — నేరాల నియంత్రణకు కఠిన చర్యలు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి అక్టోబర్ 27 (ప్రజా కలం) బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, స్టోర్స్, లాకప్ రూమ్‌లను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను రివ్యూ చేసి, విచారణలో ఉన్న కేసుల పురోగతిపై సమీక్ష జరిపారు. స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు.ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంతో పోల్చుకుంటే నేరాల రేటు తగ్గుముఖం పట్టిందని, ప్రజలు పోలీసులపై విశ్వాసం ఉంచి అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలన, యువతలో చట్టం పట్ల గౌరవం పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. కేసుల విచారణలో స్పీడ్ ఇన్వెస్టిగేషన్, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని సూచించారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ను పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటా ను తనిఖీ చేశారు. రిసెప్షన్ఈస్ట్ గా ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5 ఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకురావాలి అని సూచించారు.తనిఖీ అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రతి పోలీస్ సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాములు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల, మెట్ పల్లి సి.ఐ సురేశ్, అనిల్ కుమార్, ఎస్సై లు చిరంజీవి, రామచందర్, శ్రీధర్ రెడ్డి, నవీన్, కిరణ్ కుమార్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )