చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
వరంగల్ ,జనవరి 10 (ప్రజా కలం ప్రతినిధి)
aవరంగల్ నగరంలో చిన్నపిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న నిందితులను కాజిపేట్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి పట్టుకోవడం జరిగినది. 28.12.2025 రోజు తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడైన 5 నెలల వయసున్న మల్లన్న అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగటనలో బాలుడి తండ్రి కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇట్టి కేసు దర్యాప్తులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కాజిపేట్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారించగా నేరాస్తలం లో లభించిన ఆధారాలతో ఈ రోజు ఉదయం మళ్ళీ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేద్దామని ప్రయత్నిస్తున్న నేరస్తులైన 1)కొడుపాక నరేష్ తండ్రి;నారాయణ, వయస్సు: 42 సంవత్సరాలు కులం: సాగర కాపు, వృత్తి: వివిధ రకాల పనులు, చిరునామా: ఇంటి నం. 5-12/2, ఘవాపూర్ గ్రామం, పెద్దపల్లి జిల్లా మరియు 2) వెల్పుల యాదగిరి, తండ్రి పేరు: రామస్వామి, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: వడ్డెర, వృత్తి: డ్రైవర్, నివాసం: శాంతినగర్, పెద్దపల్లి టౌన్, పెద్దపల్లి జిల్లా ఇద్దరు కలిసి అద్దెకు తీసుకున్న TS03EZ6718 నెంబర్ గల swift desire కారులో అనుమనస్పదంగా కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫూట్ పాత్ వద్ద రెక్కి నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను కాజీపేట పోలీసులు పట్టుకొని విచారించగా వాళ్లు 28 డిసెంబర్, 2025 రోజున కిడ్నాప్ చేసిన ఐదు నెలల బాబు కిడ్నాప్ తో పాటుగా గతంలో నలుగురు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఇట్టి పిల్లలను వీళ్ళు పిల్లలు కలగలేని దంపతులకు అనాధాశ్రమాల నుంచి తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా నమ్మబలికి డబ్బులకు అమ్ముకున్నారు.
28 డిసెంబర్, 2025 రోజున కిడ్నాప్ చేసిన ఐదు నెలల బాబుని జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామంలో, ఇదే విదంగా గతంలో ఇద్దరు నిందితులు కిడ్నాప్ చేసిన నలుగురు పిల్లల్లో 2025 ఆగస్టు లో వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫాం పైన తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను మంచిర్యాల జిల్లా నస్పూర్ లో, 2023 అక్టోబర్ నెలలో కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడు సంవత్సరాల బాబును జన్నారం మండలంలో, 2025 అక్టోబర్ నెలలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిదురిస్తున్నటువంటి 05 నెలల పాపను మంచిర్యాలలో మరియు 2025 జూన్ నెలలో రామగుండం రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను జగిత్యాల జిల్లాలో అమ్మినారు. ఇట్టి నేరస్తుల నేర ఒప్పుకోలు ఆధారంగా కాజీపేటలో అపహరణకు గురైన ఐదు నెలల బాబు మల్లన్నతో పాటుగా మిగతా నలుగురు పిల్లల పిల్లలను రెస్క్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేకుండా కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది.
చిన్నపిల్లల కిడ్నాపకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో ప్రతిభకనబరిచిన టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేసారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )