
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ- రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ- రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు
మేడిపల్లి నవంబర్ 17 ( ప్రజా కలం ప్రతినిధి)
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణనే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు.రంగా పూర్ – భీమరం రహదారిపై వరద కాలువ సమీపంలోని కర్వ్ పాయింట్లో దట్టంగా పెరిగిన పొదలు, మొక్కలు కారణంగా డ్రైవర్లకు విజిబిలిటీ తగ్గి ప్రమాదాలకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేకంగా కాలువ వద్ద ఉన్న కర్వ్ పాయింట్ అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉండడంతో, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి స్వయంగా అక్కడి బుషెస్ మరియు పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించే పనులను పర్యవేక్షించారు. ఈ యొక్క చర్యల వల్ల వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేలా అనుకూల వాతావరణం ఏర్పడింది. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన మరిన్ని శాశ్వత చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగిస్తున్నామని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా రోడ్డు భద్రత కోసం పోలీసులు తీసుకున్న చొరవను స్థానిక ప్రజలు అభినందించారు.\


