
పోలీసు త్యాగాలు అజరామం
ప్రాణ త్యాగం చేసిన పోలీసులు స్మరించుకోవడం మన కర్తవ్యం
మెట్ పల్లి డిఎస్పి రాములు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి అక్టోబర్ 25 (ప్రజా కలం) ప్రాణ త్యాగం చేసిన పోలీసులు స్మరించుకోవడం మన కర్తవ్యం అని మెట్ పల్లి డిఎస్పి రాములు అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ఆయన ప్రారంభించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మెట్ పల్లి డిఎస్పి రాములు ప్రారంభించారు.ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, వ్యాపారస్తులు స్వచ్చందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్త దానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన అందరిని అభినందించారు.శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా యువత ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలోకి కొత్త రక్తం ఉత్పత్తి అవుతున్నారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరాలలో సుమారు 50 యూనిట్ల రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ అనిల్, ఎస్సై పబ్బ కిరణ్, ఎస్ఐ 2 రాజు నాయక్, ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ రక్తదాన శిబిరంలో మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన దాదాపు 50 మంది యువకులు రక్తదానం చేశారు.


