రాజకీయ దుందుభి కరుణానిధి వర్ధంతి

రాజకీయ దుందుభి కరుణానిధి వర్ధంతి

రాజకీయ దుందుభి కరుణానిధి వర్ధంతి
*ఘన నివాళులు అర్పించిన నాయీబ్రాహ్మణ జేఏసీ
గుంటూరు,ఆగస్టు 08:(ప్రజాకలం ప్రతినిధి)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి,డీఎంకే అధినేత ఎం.కరుణానిధి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు ఘనంగా నివాళులు అర్పించారు. గుంటూరులోని జేఏసీ కార్యాలయంలో కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కరుణానిధి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా,13 సార్లు అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఎన్నికై దక్షిణాది రాష్ట్రాల రాజకీయాలకు వన్నె తెచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. కరుణానిధి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.బీసీ మహాజన సభ అధ్యక్షులు సాంబశివరావు మాట్లాడుతూ, కరుణానిధి గొప్ప రాజకీయ దార్శనికుడని తెలిపారు.ధనిక వర్గ పెత్తందారులకు,బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా పెరియార్ ఆలోచనలతో జీవితకాలం నాస్తికుడిగా కొనసాగుతూ, బడుగు వర్గాలకు రాజ్యాధికార దిశగా కృషి చేశారని తెలిపారు.ఈ దేశంలో బీసీలు దేనికీ తక్కువ కాదని ఆయన నిరూపించారని సాంబశివరావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన పొలిటికల్ సెంటర్ కోఆర్డినేటర్ సాదు మల్యాద్రి,వీసీకే పార్టీ మహిళా అధ్యక్షురాలు కె.జయసుధ,రైతు కూలీ సంఘం అధ్యక్షులు పాటిబండ్ల కోటేశ్వరావు,బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ సికా సురేష్,లంబాడి హక్కుల పోరాట కమిటీ అధ్యక్షులు చంద్రనాయక్,పూలే అంబేద్కర్ లిటరేచర్ కోఆర్డినేటర్ బత్తుల విల్సన్,భీంసేన సేవా సంఘం అధ్యక్షులు నల్లపు నీలాంబరం, బీఎస్పీ నాయకులు చరతనగండ్ల వాసు, నాయీబ్రాహ్మణ సౌందర్యశాలల సంక్షేమశాఖ గుంటూరు అర్బన్ కమిటీ ఉపాధ్యక్షులు పి.శ్రీమన్నారాయణ,ప్రజాపక్షం సామాజిక న్యాయ పోరాట సంస్థ కార్యదర్శి ఎంఏఎస్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )