
“ప్రజా కలం” కథనానికి స్పందన
“ప్రజా కలం” కథనానికి స్పందన
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను అల్లుకున్న చెట్ల తీగలు…!
సంబంధించి అధికారికి ఫోన్ చేసి చెప్పిన పట్టించుకోని వైనం…!!

మెట్ పల్లి (కోరుట్ల) ప్రతినిధి జూన్ 20 (ప్రజా కలం) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను అల్లుకున్న చెట్ల తీగలు, అధికారికి ఫోన్ చేసినా పట్టించుకోని వైనం అనే “ప్రజాకలం” కథనానికి అధికారులు స్పందించారు. మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామ ఎస్సీ కాలనీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని, వర్షాలు విరివిగా కురుస్తుండడంతో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు, ఇతర మొక్కల తీగలు ఏపుగా అల్లుకున్నాయని పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని అధికారులు జూన్ 19న కథనాన్ని ప్రచాకాలంలో ప్రచురించగా జూన్ 20 న అధికారులు స్పందించి పిచ్చి మొక్కలను తీసివేశారు. పిచ్చి మొక్కల తొలగింపుకు కృషిచేసిన ప్రజా కలం కు దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు


