
ప్రజల గొంతుకగా నిలుస్తున్న ప్రజా కలం
ప్రజా కలం 2026 క్యాలెండర్ ఖమ్మం కలెక్టరేట్లో ఘనంగా ఆవిష్కరించిన ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి”
“ప్రజా కలం నూతన క్యాలెండర్‌తో ప్రజాముఖ్య అంశాలకు ప్రాధాన్యం: కలెక్టర్ అనుదీప్”
ఖమ్మం జనవరి 23( ప్రజా కలం న్యూస్)
ఖమ్మం నగరంలోని నూతన కలెక్టరేట్ భవనంలోని శుక్రవారం ప్రజల సమస్యలను నిక్కచ్చిగా ప్రతిబింబిస్తూ, ప్రభుత్వ పథకాలను విశ్లేషణాత్మకంగా ప్రజలకు చేరవేస్తున్న ప్రజా కలం తెలుగు దినపత్రిక రూపొందించిన 2026 నూతన క్యాలెండర్‌ను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఘనంగా ఆవిష్కరించారు. ఖమ్మం కలెక్టర్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సి సి, ప్రజా కలం రిపోర్టర్స్ రాయబారపు రమేష్, చెవుల భాగ్యరాజ్, ప్రభుత్వ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా కలం ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న విశ్వసనీయ దినపత్రికగా ప్రజా సమస్యలను ఎల్లప్పుడూ ముందుకు తెస్తూ, నిర్మాణాత్మక జర్నలిజానికి అద్దం పడుతోందని అభినందించారు. పాఠకుల ఆశీస్సులతో మరింత ప్రజాముఖ్య కథనాలు, విశ్లేషణలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

