ప్రజాకలం వార్త కు స్పందన

ప్రజాకలం వార్త కు స్పందన

కరెంటు తీగలను సరి చేసిన అధికారులు
మెట్ పల్లి: కరెంటు సార్లూ… ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!?

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 27 (ప్రజా కలం) కరెంటు సార్లూ ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అంటే అవును అన్నట్టుగానే ఉంది ఈ ఫోటోలో కనిపిస్తున్న తీరు… అని పట్టణంలోని గోల్ హనుమాన్ ఏరియాలో ఓ స్తంభం నుంచి కరెంటు వైర్ ప్రమాదకరమైన పరిస్థితిలో ఇనుప మెట్లను చుట్టుకుని కిందికి వేలాడుతూ కనిపిస్తుందని ,వర్షాకాలం కనుక వర్షాలు పడుస్తున్నాయి కాబట్టి వేలాడుతున్నటువంటి కరెంటు తీగను తాకిన కరెంటు మీటర్ ను తాకిన అక్కడికి ఎవరైనా వెళ్లి ఆ కేబుల్ ను ముట్టిన ఘోర ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంది అని కరెంటు సార్లు ప్రమాదం జరగకముందే ముందు జాగ్రత్తగా అటువంటి కరెంటు తీగలని సరిచేసి బాధ్యత కరెంటు అధికారుల పైన ఉన్నదని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అని ప్రజాకలం దిన పత్రిక ప్రచురించిన సంగతి తెలిసిందే… కరెంటు అధికారులు శుక్రవారం కరెంటు తీగలను సరి చేయడం జరిగింది ప్రమాదం జరగకుండా కరెంటు అధికారులను అప్రమత్తం చేసిన ప్రజాకలం దినపత్రిక ను పట్టణ ప్రజలు అభినందించారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )