రచ్చబండ వద్ద పెద్ద మనుషుల మాటా మంతి

రచ్చబండ వద్ద పెద్ద మనుషుల మాటా మంతి

రచ్చబండ వద్ద పెద్ద మనుషుల మాటా మంతి
–గుల్లకోట గ్రామపంచాయతీ ముందు మర్రి చెట్టు కింద
ఎండపల్లి, జూన్ 18 ( ప్రజా కలం ప్రతినిధి )
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజ కవర్గం ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామం లోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గల మర్రి చెట్టు కింద రచ్చబండ (సమావేశ స్థలం) వద్ద మంగళవారం జీవన వైవిధ్యభరి తమైన ఛాయాచిత్రం చూపరుల ను అమితంగా ఆకర్షిస్తుంది అన డంలో అతిశయోక్తి లేదు గుల్లకోట లో గ్రామ పంచాయతీ కార్యాల యం ముందు అచ్చంగా అనాది సాంప్రదాయ హంగులు పొంగు లను పోలి ఉంది. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. గుల్లకోట గ్రామానికి చెందిన కొందరు పెద్ద మనుషులు పాలకుర్తి సాయిలు, బుర్ర వెంకయ్య, పొన్నం బుచ్చయ్య, గోనె మల్లేశం, గొల్లపెల్లి నర్సయ్య పొన్నం రాజయ్య మంగళవారం రోజున ఉదయం సమావేశమయ్యారు. వారి జీవన పరమాంకంలో ఎదుర్కొన్న, గత, అనుభవాలను ప్రస్తుత అనుభవాలను పరిస్థితులను నెమరు వేసుకున్న నేపథ్యంలో గుల్లకోట గ్రామానికి చెందిన సామాజిక సేవకులు గుల్లకోట తాజా మాజీ ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీజ భర్త గొల్లపెల్లి మల్లేశం వారిని చూసి దృష్టి వారి పై మళ్ళింది. ఆయన ఆలోచన వారిని ఛాయాచిత్రం గా తీసిన ఫోటో ఆధారంగా ఈ అనాది పెద్ద మనుషుల నడవడికలు, జీవన విధానాలు, సాంప్రదాయ, వ్యవహారాల విషయాలను నేటి తరానికి తెలియవని వాటిని నేటి సభ్య సమాజానికి తెలిపే విధంగా ప్రయత్నం చేసింది ఈ ఛాయాచిత్రం పెద్దమనుషుల మాటలు ఎలా ఉన్నాయంటే నేటి సెల్ ఫోను 6 జీ అంతర్జాల నూతన తరం సగటు మనిషి జీవితం లో సమాచార విప్లవాన్ని శృంస్టించిన సెల్ ఫోన్ వాడకానికి విరుద్ధంగా ఉంది. నాటి తరం పెద్ద మనుషులు రచ్చబండల వద్ద అనేక సమాచారం ఒకరి నుంచి మరొకరికి తెలిసేది నేటితరం యువకులు సెల్ ఫోన్ లలో బిజీగా ఉండే యువకులకు ఈ పెద్ద మనుషులను చూసైనా ఈ తరం యువకులు రచ్చబండ అంటే ఏంటో ఈ పెద్దమనుషులను చూసి అన్న నేర్చుకోవాలని గొల్లపెల్లి మల్లేశం తెలిపారు అదేవిధంగా ఎంత మొండి పంచాయితీలైనా కూడా ఈ రచ్చబండ వద్ద నే ఇక్కడే నివృత్తి అయ్యేవి. నేటి నూతనతరం మనిషి కి దైనందిన జీవితంలో జీవన విధానం ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితంలో బిగింపులతో కొనసాగుతున్న వేళ ఈ పెద్ద మనుషుల రచ్చబండ వద్ద అందరి కలయిక తో ఈ తరం యువకులు రచ్చబండ అంటే ఏంటిదో ఈ పెద్దమనుషులను చూసి తెలుసుకోవాలని సామాజిక సేవకులు గొల్లపెల్లి మల్లేశం విజ్ఞప్తి చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )