ఏసీబీకి దొరికిన రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి కమిషనర్ రవికుమార్

ఏసీబీకి దొరికిన రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి కమిషనర్ రవికుమార్

2 లక్షలు లంచం తీసుకుంటుండగా
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ
రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రవి కుమార్
రాజేంద్రనగర్,జులై 25,(ప్రజా కలం)
రాష్ట్రంలో ఏసీబీ (ఏసీబీ ) అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఓ హోటల్ యజమాని నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఏసీబీ అధికారులు చాలా యాక్టీవ్ పనిచేస్తున్నారు.అవినీతి తిమింగలాలను కొన్నిరోజుల క్రితమే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్రావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడటం హాట్ టాపిక్గా మారింది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )