
ప్రాణాలు పోతే గాని రోడ్డు పనులు పూర్తి చేయరా…
ప్రాణాలు పోతే గాని రోడ్డు పనులు పూర్తి చేయరా…
రావిరాల నుండి సర్దార్ నగర్ వెళ్లే రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి
తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్
మహేశ్వరం, మార్చ్ 04,(ప్రజా కలం)
జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ 66వ వార్డు లోని రావిరాల నుండి సర్దార్ నగర్ వెళ్లి ఆర్ఎంబి ఈ రోడ్డుకు సంబంధించి గత స్పెషల్ ఆఫీసర్ ద్వారా నిధులు మూడు కోట్ల 50 లక్షల రూపాయలతో ఏడు మీటర్ల రోడ్డు వేయుటకు ప్రతిపాదనలు పంపించారు. అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ వచ్చాయి సంబంధిత కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారు కానీ ప్రస్తుతం అట్టి పనులు నత్తనడక సాగుతున్నాయని తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ సంబంధిత అధికారులైన ఎస్ ఈ కిష్టప్ప, డి ఈ పద్మా రెడ్డి, జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులతో కలిసి రోడ్డు పనులను పరిశీలించారు. అదేవిధంగా ఇక్కడికి రోడ్డు ఎక్కువగా మునగడం వల్ల రాకపోకలకు ఇబ్బంది అవుతుందో అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో సలహా తీసుకొని రోడ్డుకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన అంతరాయం కలవకుండా రోడ్డుని వేయాలని అదేవిధంగా రావిరాల చెరువు కట్ట దగ్గర నిలిచిపోయిన అలుగు చెక్ డాం పనులను వెంటనే పూర్తి చేయాలి అధికారులను కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.

