ఐరిష్ పబ్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఐరిష్ ట్రయల్(Irish Trail) పేరిట ఒక సరికొత్త వేడుకను ప్రారంభించిన రాయల్ ఛాలెంజ్

ఐరిష్ పబ్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఐరిష్ ట్రయల్(Irish Trail) పేరిట ఒక సరికొత్త వేడుకను ప్రారంభించిన రాయల్ ఛాలెంజ్

ఐరిష్ పబ్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఐరిష్ ట్రయల్(Irish Trail) పేరిట ఒక సరికొత్త వేడుకను ప్రారంభించిన రాయల్ ఛాలెంజ్

వరంగల్,  మార్చి 13 ప్రజాకలం ప్రతినిధి…  రాయల్ ఛాలెంజ్ తన సరికొత్త విస్కీ బ్లెండ్ ఐరిష్ ట్రయల్‌ను ఒక అద్భుతమైన బార్ అనుభవంతో ప్రారంభించింది. హైదరాబాద్‌ మాదాపూర్‌లో కాక్ అండ్ బుల్ వేదికగా ఐరిష్ పబ్ అనుభవానికి ప్రతీకగా నిలిచే స్నేహం, అనుబంధం, సంగీతం వంటి అంశాలను ఈ వేడుక ప్రతిబింబించింది.

ఈ ప్రారంభ వేడుకలో ఐరిష్ ట్రయల్‌ను వివిధ రకాలుగా ప్రదర్శించారు. ఇంటరాక్టివ్ షోకేస్ జోన్‌లు, బ్రాండెడ్ పబ్ గేమ్‌ల నుండి లైవ్ ఐరిష్ సింగాలాంగ్ ప్రదర్శనలు, ప్రత్యేకమైన కాక్టెయిల్స్ వరకు అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. అతిథులు ఆవిష్కరణ క్షణాన్ని వీక్షించడమే కాకుండా ఐరిష్ కాఫీ, ఐరిష్ ఓల్డ్ మెయిడ్, ఐరిష్ బక్, ఐరిష్ సోర్, పికిల్డ్ ట్రయల్ వంటి రకరకాల కాక్టెయిల్స్‌ను రుచి చూశారు. ఈ డ్రింక్స్ బ్లెండ్ వైవిధ్యతను, దానిలోని మృదుత్వాన్ని చాటిచెప్పాయి.

రాయల్ ఛాలెంజ్ ఐరిష్ ట్రయల్ ప్రస్తుతం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరలు 750 మి.లీ కి 1360 రూపాయలు, 375 మి.లీ కి 680 రూపాయలు, 180 మి.లీ కి 340 రూపాయలుగా ఉన్నాయి.మరింత విస్తరిస్తోంది.

డయాజియో ఇండియా(Diageo India) చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రుచిరా జైట్లీ(Ruchira Jaitly) ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “ప్రస్తుతం వినియోగదారులు మద్యం విషయంలో కొత్త రకమైన, అంతర్జాతీయ స్థాయి అనుభవాలను కోరుకుంటున్నారు. విస్కీ విభాగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అసలైన రుచి, మృదుత్వం, కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు” అని పేర్కొన్నారు.

డయాజియో ఇండియా రాయల్ ఛాలెంజ్ ఐరిష్ ట్రయల్‌తో తన ప్రీమియం ఉత్పత్తులను అంతర్జాతీయ విస్కీ శైలులను భారతీయ వినియోగదారులకు పరిచయం చేస్తూనే, నేటి కాలపు వేడుకలకు తగినట్లుగా సులభంగా నచ్చే మృదువైన రుచిని ఇది అందిస్తోంది. భారతదేశంలో ఐరిష్ విస్కీని ఆస్వాదించే విధానంలో ఈ బ్లెండ్ ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )