దేవదాయ శాఖకు ఆర్టిఐ చట్టం వర్తిస్తుంది

దేవదాయ శాఖకు ఆర్టిఐ చట్టం వర్తిస్తుంది

సమాచార హక్కు చట్టం కమిషనర్లు పివి శ్రీనివాస్ అయోధ్య రెడ్డి ల స్పష్ఠీకరణ
యాదాద్రి నవంబర్ 12 ( ప్రజాకలం ప్రతినిధి)
దేవదాయ శాఖకు ఆర్.టి.ఐ చట్టం వర్తిస్తుంది అని ఆర్ టి ఐ కమిషనర్లు పివి శ్రీనివాస్ బో రెడ్డి అయోధ్య రెడ్డిలు స్పష్టం చేశారు బుధవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు సమర్పించిన సమాచార హక్కు చట్టం కింద ఉన్నటువంటి అర్జీలకు ఇయరింగ్ కోసం రావడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నామని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాదాయ శాఖ కూడా ఆర్టిఐ చట్టం పరిధిలోకి వస్తుందని అన్నారు కొందరు దేవాదాయ శాఖ ఆర్టిఐ చట్టం పరిధిలోకి రాదని వాదిస్తూ ఉన్నప్పటికీ కేరళ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం దేవాదాయ శాఖ కూడా ఆర్టిఐ చట్టం పరిధిలోకి వస్తుందని అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆర్టిఐ చట్టం పరిధిలోకి వస్తుందని అన్నారు ప్రభుత్వం ద్వారా ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్కలు ఉండాలని వాటిని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని అన్నారు దాతలు సమర్పించిన విరాళాలు ప్రభుత్వంలో జమ అయిన తర్వాత వాటికి కచ్చితంగా లెక్కలు చూపించాల్సిందేనని అన్నారు గతంలో అనేక రకాల కారణాలతో దేవాదాయ శాఖ సమాచార హక్కు చట్టం కిందకు రాదు అని పలువురు వాదించినప్పటికీ కచ్చితంగా దేవాదాయ శాఖ కూడా సమాచార హక్కు చట్టం కిందికే వస్తుందని వారు స్పష్టం చేశారు దేవాదాయ శాఖలో ఆయా దేవాలయాలను జరుగుతున్న ఖర్చులు వస్తున్న ఆదాయం వాటి వివరాలు ప్రజలు తెలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు ప్రభుత్వం ద్వారా జరిగే అభివృద్ధి సంక్షేమం అంశాలపై పూర్తి వివరాలు సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని వారు స్పష్టం చేశారు వారి వెంట స్థానిక అధికారులు ఆలయ అధికారులు ఉన్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )