
ఎండపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా సంగ రమేష్ యాదవ్ ఏకగ్రీవం
ఎండపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా సంగ రమేష్ యాదవ్ ఏకగ్రీవం
ఎండపల్లి, జనవరి 10 : ( ప్రజా కలం ప్రతినిధి )
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల సర్పంచు లు అందరు కలిసి రాజారాంపల్లి సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్ ను సర్పంచు ల ఫోరం అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచులు తాటిపర్తి రాజమ్మ శైలేందర్ రెడ్డి, గొల్లపెల్లి మల్లేష్ గౌడ్, కొంగల జగదీశ్వర్ రెడ్డి, జీ రెడ్డి మహేందర్ రెడ్డి, మారం సునీత జెలేందర్ రెడ్డి, కంధికట్ల అమృత-రాజేష్, కోడిపేల్లి కొమురమ్మ-శ్రీనివాస్, బాలసాని శారద-మల్లేశం గౌడ్, సింగిరెడ్డి లింగారెడ్డి, దర్శనల నరేష్, పడిదం లావణ్య-మొగిలి, ఆవుల మమత-తిరుపతి, గాధం భాస్కర్, బెడ్డల ప్రవీణ్ లు సంఘ రమేష్ యాదవ్ ను ఏక గ్రీవంగా ఎన్నుకో వడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ రమేష్ యాదవ్ మాట్లాడు తూ ఎండపల్లి మండలం లో ఉన్న 15 గ్రామాల సర్పంచుల గ్రామాల్లో ఉన్న సమస్యల కోసం మరియు అభివృద్ధి కోసం పాటు పడుతానని హామీ ఇచ్చారు. ఎన్నిక కు సహక రించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, మాజీ ఎంపీపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మద్దెల గోపాల్ రెడ్డి మరియు ప్రతి ఒక్క సర్పంచ్ కు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

