సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

జిల్లా ఎస్పి అశోక్ కుమార్
అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 27 (ప్రజా కలం) సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.మొదటి విడతలో బాగంగా ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరిగిందని, నామినేషన్ ప్రక్రియకు అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లును చేయడం జరిగిందని అన్నారు.కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిదిలోని ఐలాపూర్, పైడిమడుగు గ్రామలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను డిఎస్పి తో కలిసి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిది నిభందన ఉంటుందని, నామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు.సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నామినేషన్ల దాఖల సందర్భంలో అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అన్నారు.ఎస్పీ వెంట డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్, ఎస్.ఐ లు చిరంజీవి, రామచంద్రం ఉన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )