
స్కూల్ బస్సు ప్రమాదం… విద్యార్థులు సురక్షితం
స్కూల్ బస్సు ప్రమాదం… విద్యార్థులు సురక్షితం
మల్లాపూర్ ఫిబ్రవరి 10 ( ప్రజా కలం ప్రతినిధి)
మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయిన క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో కొత్త ధాం రాజ్ పల్లి గ్రామానికి చెందిన హనీష్ (2వ తరగతి) అనే బాలుడికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పాఠశాల సిబ్బంది అతడిని అంబులెన్స్‌లో మెట్‌పల్లి లోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అయితే మిగిలిన విద్యార్థులందరూ సురక్షితంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
TAGS Hot News

