
శివాజీ విగ్రహాన్ని అడ్డుకున్న కొందరు
శివాజీ విగ్రహాన్ని అడ్డుకున్న కొందరు
– సముదాయించిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు
ఇబ్రహీంపట్నం: ప్రతినిధి, ఫిబ్రవరి 2 (ప్రజాకలం) : ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో త్వరలో ప్రతిష్టాపించడానికి తీసుకు వస్తున్న శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా ఆదివారం రాత్రి కొంతమంది అడ్డుకోగా వారిని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు సముదాయించారు. కొద్ది రోజుల్లో జరిగే ప్రతిష్టాపనకు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గ్రామానికి తీసుకువస్తుండగా స్థానికులు కొంతమంది అభ్యంతరం తెలిపారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు దృష్టికి కార్యక్రమ నిర్వాహకులు తీసుకెళ్లారు. వెంటనే డాక్టర్ రఘు హుటాహుటిన అమ్మక్కపేట చేరుకొని విగ్రహ రాకకు అభ్యంతరం తెలుపుతున్న వారితో మాట్లాడి వారిని సముదించారు. అనంతరం విగ్రహాన్ని ప్రతిష్టాపన జరిపే ప్రాంతంలో ఏర్పాటు చేయించారు. త్వరలోనే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కాగా గ్రామానికి విగ్రహాన్ని తెప్పించడంలో సహకరించిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘుకు కార్యక్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్, పోలీసు సిబ్బందికి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


