అంగరంగ వైభవంగా శ్రీ మల్లన్న కళ్యాణం

అంగరంగ వైభవంగా శ్రీ మల్లన్న కళ్యాణం

అంగరంగ వైభవంగా శ్రీ మల్లన్న కళ్యాణం
భక్తులతో కిక్కిరిసిన దేవాలయం

బన్సీలాల్ పేట్, మార్చి 20 ( ప్రజా కలం ప్రతినిధి): బన్సీలాల్ పేట్ డివిజన్ బోలక్ పూర్ లోని ప్రసిద్ధ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీ మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన శివసత్తులు, భక్తుల కోలాహలంతో దేవాలయం కళకళలాడింది.
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయబద్ధంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అగ్నిగుండాలు, ప్రత్యేక పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. పసుపు బండారుతో ఆలయం పరిసరాలు పసుపుమయంగా మారి భక్తి వాతావరణాన్ని తలపించాయి.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు పూర్ణకుండంతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, దేవాలయం మాజీ చైర్మన్ శ్రీరాములు, నాయకులు లక్ష్మీపతి, నాగలక్ష్మి, మహేందర్ గౌడ్, శంకర్, దేవేందర్, కుమార్ యాదవ్, అరుణ్ గౌడ్, విజయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీ మల్లన్న ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనందకరమన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )