
13 రోజులకు దొరికిన శ్రీకర్ మృతదేహం ..
– కుటుంబంలో విషాదం
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 08 (ప్రజా కలం)మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో వినాయకునికి తేవడానికి వెళ్ళి అదుపు తప్పి ట్రాక్టర్ ఎస్సారెస్పీ కాలువ లో పడి శ్రీకర్ కనిపించకుండా పోయిన ఘటనకు తెరపడింది. 13 రోజుల క్రితం గల్లంతైన శ్రీకర్ కోసం ఎంత గాలించినా లంబించలేదు.చివరకు శ్రీకర్ మృతదేహం తాటిపెల్లి సరిహద్దు కాలువలో తేలియాడుతూ కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం తో కన్నీరుమున్నీరవుతున్నారు.దీంతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
శరీరం ఉబ్బిపోవడంతో దుస్తులు మరియు ఇతర వివరాల ఆధారంగా మృతదేహం శ్రీకర్‌దేనని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

TAGS Hot News

