చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
* వలిగొండ ఎస్సై యుగంధర్ గౌడ్
వలిగొండ జనవరి 11 ప్రజాకలం:చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,వలిగొండ ఎస్ఐ యుగేందర్ గౌడ్ తెలిపారు.జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో పతంగుల విక్రయ దుకాణాలలో పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.పతంగులు ఎగురవేసే క్రమంలో చైనా మాంజలు వాడితే,పిల్లల వేళ్లు తెగడంతో పాటు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు.అలాగే పక్షులు.వన్యప్రాణాలకు ప్రాణ ముప్పు పొంచి ఉందన్నారు.గాలి పటాలు ఎగర వేసేటప్పుడు కేవలం నూలు దారాలతో మాత్రమే ఎగరవేయాలన్నారు.నైలాన్ సింథటిక్ దారాలతో తయారుచేసిన,మాంజాలతో పర్యవరానికి విపత్తుగా మారడంతో పాటు,ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరించారు.ఎవరికీ ఏ హాని కలగకుండా సాధారణ దారంతో,గాలిపటాలను ఎగురవేసుకోవాలని సూచించారు.ఎవరైనా చైనా మాంజలను విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది,పాల్గొన్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )