ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష
మెట్పల్లి సిఐ అనిల్ కుమార్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 29 (ప్రజా కలం) నిర్లక్ష్యంగా వాహన నడిపి మృతికి దారణమైన ఘటనలో నిందరికి 10 నెలల జైలు శిక్ష విధిస్తూ మెట్‌పల్లి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం. అరుణ్ కుమార్ తీర్పు వెలువరించారు
మెట్పల్లి సీఐ తెలిపిన విరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుల సాయన్న అనే ఆటో డ్రైవర్ తేది 25-02-2020న మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి కిరాయికి వెళ్లి తన ఆటోను రోడ్డు పక్కన పార్క్ చేశాడు. అదే సమయంలో నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామానికి చెందిన ఆర్టిసి కండక్టర్ దుంపటి లక్ష్మీ రాజ్యం తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి, పార్క్ చేసిన ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజుల సాయన్న తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు .
దర్యాప్తులో, అప్పటి ఇబ్రహీంపట్నం ఎస్సై ఎం. అశోక్ కుమార్ కేసు నమోదు చేయగా, మెట్‌పల్లి సీఐ ఎల్. శ్రీను పకడ్బందీగా విచారణ జరిపి, నిందితుని కి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్ట్ ట్రయల్ సమయంలో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ ఎం. చక్రపాణి సాక్షులను ప్రవేశపెట్టగా, ఏపీపీ ప్రణయ్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం, మెజిస్ట్రేట్ ఎం. అరుణ్ కుమార్ నిందితుడికి పది నెలల జైలు శిక్ష విధించారు
ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన సీఐ ఎల్. శ్రీను, ఎస్సై ఎం. అశోక్ కుమార్, కానిస్టేబుల్ ఎం. చక్రపాణిలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు
ఈ సందర్భంగా మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ తీర్పు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారందరికీ గట్టి హెచ్చరికగా నిలుస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన శిక్షలు తప్పవు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి హెల్మెట్ ధరించాలి , వాహన పత్రాలు కలిగి ఉండాలి , మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు , మద్యం సేవించి వాహనం నడుపరాదు అని మెట్ పల్లి సీఐ
వి. అనిల్ కుమార్ అన్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )