
ముదిరిన మెట్ పల్లి క్లబ్ అక్రమ విక్రయ వ్యవహారం
విక్రయించిన వారిపై కేసు నమోదు
విచారిస్తున్న పోలీస్ అధికారులు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 28 (ప్రజా కలం)
మెట్ పల్లి క్లబ్ అక్రమంగా సభ్యుల అనుమతి లేకుండా విక్రయించినందున అట్టి బాడీ మెంబర్స్ పై మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా సోమవారం రోజు మెట్ పల్లి పోలీస్ స్టేషన్ అధికారులు వచ్చి విచారణ చేపట్టినారు. పోలీస్ అధికారులు మెట్ పల్లి క్లబ్ అక్రమంగా విక్రయించిన భూమి దగ్గరికి వచ్చి విచారణ చేపట్టడం జరిగింది పూర్తిస్థాయి విచారణ జరిపి పై అధికారులకు సమాచారం అందించి తగు న్యాయం జరిగేలా చేస్తామని ఫిర్యాదారులకు అధికారులు తెలపడం జరిగింది
TAGS Hot News

