ఇసుకసురుల ఇష్టారాజ్యం

ఇసుకసురుల ఇష్టారాజ్యం

ఇసుకసురుల ఇష్టారాజ్యం
ఆగని అక్రమ ఇసుక రవాణా…?
జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు…

ఇబ్రహీంపట్నం జూన్ 23 (ప్రజా కలం ప్రతినిధి)
సమయం సందర్భం అనే పదానికే అర్థం తెలియకుండా అక్రమ ఇసుక రవాణా ఇబ్రహీంపట్నం మండలంలో ఇసుకసురుల ఇష్టారాజ్యంగా జోరుగా సాగుతుంది. దర్జాగా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో విచ్చలవిడిగా రాత్రి వేళలో, తెల్లవారుజామున ఇసుక రవాణా మూడు పూలు ఆరు కాయలను కొనసాగుతుంది. ఇబ్రహీంపట్నం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన కోమటి కొండాపూర్, ఎర్దండి, వేముల కుర్తి గ్రామాల నుంచి నిత్యం ట్రాక్టర్ ద్వారా ఇసుక రవాణా జరుగుతుంది. అలాగే పక్కనే ఉన్న మల్లాపూర్ మండలం మొగిలిపేట నుంచి మండలంలోని గోధూర్, తిమ్మాపూర్, యామాపూర్, ఇబ్రహీంపట్నం గ్రామాలకు అక్రమ ఇసుక సరఫరా జరుగుతున్న అధికారులకు మాత్రం కనిపించడం లేదు. అంతేకాకుండా పక్క జిల్లాల నుంచి సైతం ఇసుక యథేచ్ఛగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు అక్రమ ఇసుకకు అడ్డుకట్ట వేయాలని సూచించిన ఆచరణలో అమలు కాకపోవడం, జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నారు అనడంలో ఇలాంటి సందేహం లేదు. మండలంలోని కోమటి కొండాపూర్, వేములకుర్తి గ్రామాలలో ఇసుక డబ్బులు నిలువ ఉన్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. మండలం తో పాటు, ఇతర మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది బహిరంగ రహస్యం. అక్రమ ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ఎవరు పట్టుకునేవారు ఉండరు అనే ఉద్దేశంతో ఇసుక వ్యాపారులు ఆ సమయాల్లో అక్రమ ఇసుకను దర్జాగా రవాణా చేస్తున్నారు. అయితే ఈ రవాణా జరుగుతున్న సంగతి రెవెన్యూ అధికారులకు తెలిసా లేదా తెలియదా అన్నదానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులకు పకడ్బందీగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )