
ప్రజా సేవలో పాత్రికేయుల పాత్ర కీలకం..
ప్రజా సేవలో పాత్రికేయుల పాత్ర కీలకం..
– బిజెపి రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు
మల్లాపూర్ జూన్ 24 ( ప్రజా కలం ప్రతినిధి)
ప్రజాసేవలో పాత్రికేయుల పాత్ర అభినందనీయం అని బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు అన్నారు. ఈ మేరకు మల్లాపూర్ మండల కేంద్రం లో గల బీజేపీ కార్యాలయం లో బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మండల జర్నలిస్ట్ లు అందరికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోస్టల్ బీమా పథకాన్ని జర్నలిస్ట్ లు అందరికి చేయించి బాండ్ల ను అందచేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో జర్నలిస్ట్ ల పాత్ర మరువలేనిది అని అన్నారు.ప్రజలను చైతన్యపరచడానికి అనునిత్యం కృషి చేస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టులకు తగిన గుర్తింపు దక్కడం లేదని బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మి, బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు ఉపాధ్యక్షుడు లవంగ శివ. బిజెపి ప్రధాన కార్యదర్శి కాంతయ్య చారి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రమేష్, గుగ్గిళ్ళ రాజశేఖర్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

