భర్తను హత్య చేయించిన భార్య

భర్తను హత్య చేయించిన భార్య

యాదాద్రి జిల్లాలో దారుణం..
భర్తను హత్య చేయించిన భార్య
* సుపారీ గ్యాంగ్‌తో భర్తను హత్య చేయించిన భార్య
* బైక్‌ను కారుతో ఢీకొట్టి చంపినట్టు పోలీసుల నిర్ధారణ
* మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఘటన
* విచారణలో బయటపడ్డ వాస్తవాలు
* వివరాలు వెల్లడించిన డీసీపీ అక్షాంశ్ యాదవ్
యాదాద్రి/ భువనగిరి ప్రజాకలం:వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి.తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కోపం హత్యలకు దారితీస్తున్నాయి.ఇలా కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతోపాటు..బాధితుల బిడ్డలు అనాధలుగా మారుతుండడం అందరిని కలవరపెడుతోంది.తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య..ప్రియుడు,తమ్ముడితో కలిసి భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది.పోలీసులు రంగంలోకి దిగడంతో భార్య చివరికి కటకటాల పాలైంది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి(38)కి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 2005లో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు కుమార్తెలు,కుమారుడు ఉన్నారు.పల్లెర్లలోనే ఉంటూ భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా స్వామి పనిచేస్తున్నాడు.భార్య స్వాతి కూడా షో రూమ్ లో పని చేస్తోంది.ఇదే సమయంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ కు చెందిన సాయికుమార్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి చేసింది.ఈ వివాహేతర సంబంధం కాపురంలో చిచ్చు పెట్టింది.కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు కూడా జరుగుతున్నాయి.తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు భార్య స్వాతి పథకం వేసింది.పల్లెర్లకు చెందిన ఫ్రెండ్ వీరబాబుతో కలిసి స్వామి భువనగిరికి వెళ్ళాడు.ఇద్దరూ బైక్ పై అర్ధరాత్రి స్వగ్రామానికి బయలుదేరారు.మోట కొండూరు మండలం కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జి దాటగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. కారు.. బైక్ ను 50 మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లింది. దీంతో స్వామి అక్కడిక్కడే మృతిచెందాడు..యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామ శివారులో జరిగిన స్వామి హత్య కేసు కీలక మలుపు తిరిగింది.ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.స్వామి హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు.చెల్లి వరుసైన మహిళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడంతో.. అతన్ని చంపేశారని డీసీపీ అక్షాంశ్ యాదవ్ మీడియా సమావేశంలో తెలిపారు.సినీ ఫక్కీలో భర్తను హత్య చేయించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి,ఆమె ప్రియుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.మరో నిందితుడు రామలింగస్వామి పరారీలో ఉండగా..అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.మంగళవారం యాదాద్రి జిల్లా డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం..ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన స్వామి (38) హత్యకు గురయ్యాడు.భార్య స్వాతి తన ప్రియుడు సాయికుమార్, సోదరుడు మహేశ్ తో కలిసి భర్తను చంపించింది.బైక్ పై వెళ్తున్న స్వామిని కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది.స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. స్వాతి,సాయికుమార్,మహేశ్ లపై పోలీసులు హత్యానేరం,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.నిందితుల నుంచి 3 ఫోన్లు,బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )