
ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్ , ఆయిల్ దొంగిలిస్తున్న దొంగల అరెస్ట్..
ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్ , ఆయిల్ దొంగిలిస్తున్న దొంగల అరెస్ట్..
– వంద కిలోల కాపర్ వైర్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం
– దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు
మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్.
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 21 ( ప్రజా కలం)
ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్, ఆయిల్ ను దొంగిలిస్తున్న దొంగలను మెట్ పల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్సై పబ్బా. కిరణ్ కుమార్ శనివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెల్లులలో నివాసం ఉంటున్న నిర్మల్ జిల్లాకు చెందిన మోతే సాయి (22) పట్టణంలోని అయ్యప్ప దేవాలయం రోడ్ కు చెందిన పల్లపు మల్లేశం (32) లు ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు సులభంగా సంపాదించాలని ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నారని. ఇటీవల పలుచోట్ల ట్రాన్స్ఫార్ల నుండి ఆయిల్, కాపర్ వైర్ దొంగతం చేయగా వచ్చిన పిర్యాదు మేరకు పగడ్బందీగా తనిఖీలు నిర్వహించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై పబ్బ .కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కేసును అతి తక్కువ సమయంలో చేదించేందుకు కృషి చేసిన సీఐ అనిల్ కుమార్, ఎస్సై పబ్బ .కిరణ్ కుమార్, కానిస్టేబుల్ లు విశాల, ప్రణయ్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ రాములు లు అభినందించారు.

