వ్యాపారులను బెదిరించిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు –  రిమాండ్

వ్యాపారులను బెదిరించిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు – రిమాండ్

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జనవరి 09(ప్రజా కలం) ఎయిర్టెల్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను బెదిరించిన కేసులో డిస్టిబూటర్ చేసిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కోరుట్ల సీఐ సురేష్ బాబు తెలిపారు. ఈ నెల 6 కోరుట్ల పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసు వివరాలను సీఐ సురేష్ బాబు వెల్లడించారు. కోరుట్లలో ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగస్తులను కొంతమంది కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్టెల్ నిర్వాహకులు ఇక్కడ బిజినెస్ నిర్వహించాలంటే మొబైల్ అసోసియేషన్ కి రూ. 10 లక్షలు ఇస్తేనే ఇక్కడ బిజినెస్ నిర్వహించాలని, లేకుంటే ఇక్కడ బిజినెస్ చేయకుండా చేస్తామని తుపాకులు, కత్తులతో వీడియో కాల్ చేసి బెదిరించారని పేర్కొన్నారు. దానికి భయపడి వారు 30 వేల రూపాయలని కూడాఈ వ్యక్తులకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపించారన్నారు. ఎయిర్టెల్ డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ అయిన దండ బోయిన అరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్త శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తుల పైన కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి డిఎస్పి ఏ.రాములు ఆధ్వర్యంలో కోరుట్ల సిఐ బి.సురేష్ బాబు, కోరుట్ల ఎస్సై ఎం.చిరంజీవి లు రెండు బృందాలుగా ఏర్పడి గురువారం ఈ బెదిరింపులకి పాల్పడ్డ ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక ఎయిర్ గన్ రైఫిల్, ఒక ఎయిర్ గన్ పిస్టల్, ఒక తల్వార్, మూడు చిన్న కత్తులని, వీడియో కాల్ చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ లని స్వాధీనపరచుకొని వారిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరైనా కోరుట్ల పట్టణంలోని వ్యాపారస్తులను, రియాల్టర్లను, రైస్ మిల్లర్ యజమానులను బెదురుంపుల పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లతే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని రౌడీషీట్లు ఓపెన్ చేసి, పిడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేశ్ బాబు తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )