
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడమే టీడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి సైదులు
మహేశ్వరం నియోజకవర్గం టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
నూతన కమిటీ అధ్యక్షుడిగా తడక నర్సింహా
జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
మహేశ్వరం, జులై 08,(ప్రజా కలం)
జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కమిటీ అధ్యక్షుడిగా తడక నర్సింహా అన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం న్యాయ పోరాటం చేస్తుందని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి సైదులు అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల కేంద్రంలోని రఘుపతి కాంప్లెక్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ మహేశ్వరం నియోజకవర్గం నూతన కమిటీని ఎన్నుకున్నారు.*టిడబ్ల్యూజేఎఫ్ మహేశ్వరం నియోజకవర్గం నూతన కమిటీ*టిడబ్ల్యూజేఎఫ్ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడిగా తడక నర్సింహ,కార్యదర్శిగా కోర్వీ సురేందర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా రాందాస్, మిద్దింటి ప్రభాకర్,మీసాల శ్రీనివాస్ రావు, సహాయ కార్యదర్శులుగా పార్లకుర్ల వెంకటేష్,మారమోనీ ప్రశాంత్, కోశాధికారిగా రాజు, ప్రచార కార్యదర్శిగా రాజేశ్వరిని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ రిపోర్టర్లు గణేష్ ,సురేష్, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు శ్రీరాములు,శేఖర్, ఆంజనేయులు,చండీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడు తడక నర్సింహా మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

