
తెలియని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ కి, మెసేజ్ కి స్పందించవద్దు*
మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్
*సైబర్ క్రైమ్ ఫై విద్యార్థులకు అవగాహన*
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 03(ప్రజా కలం)
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లిలో బుధవారం రోజు సీఐ వి. అనిల్ కుమార్ , ఎస్ఐ పబ్బ కిరణ్, కళాశాల విద్యార్థులకు, సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనూ తెలియని నెంబర్ నుండి వచ్చిన కాల్స్ కి, మెసేజ్ లకు స్పందించవద్దని, ఇట్టి విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మిత్రులకు తెలియజేయాలని, ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకున్న, తీసుకున్నట్లు అనుమానం వచ్చిన వారి సమాచారాన్ని మా దృష్టికి తీసుకురావాలని లేదా మీ ఉపన్యాసకుల ద్వారా తెలియపరచాలని, అమ్మాయిలను ఎవరైనా వేధించిన, అసభ్యకరంగా ప్రవర్తించిన మా దృష్టికి తీసుకురావాలని, పోలీస్ శాఖ అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ సంగెం దేవారం అధ్యక్షత వహించగా కళాశాల ఉపన్యాసకులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమo లో పాల్గొన్నారు.

