విడిసి వర్సెస్ అధికారులు
ముదురుతున్న ఇసుక వివాదం..
ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా గ్రామస్తుల మధ్య వాగ్వాదం
నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు
విచారణ చేపట్టిన మెట్ పల్లి డీఎస్పీ ఏ .రాములు
మెట్ పల్లి: మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఇసుక విషయమై జరిగిన వివాదంపై మెట్ పల్లి పోలీసులు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఈనెల 10న అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేం దుకు ప్రయత్నించినా రెండు రోజులైనా అదుపు లోకి రాలేదు. యార్డులో గన్నీసంచులు కాలుతుండ గా వాటిపై ఇసుక పోసి మంటలు ఆర్పాలని అధికారులు నిర్ణయించారు. మెట్ పల్లి ఆర్డీవో ఆదేశాల మేరకు మెట్ పల్లి ఎమ్మార్వో తెలుపగా అధికారులు నాలుగు ట్రాక్టర్లను ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఈనెల 12న ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. ఆ సమయంలో కొంతమంది గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకుని వివాదం చేశారు. మా ఊరి నుండి ఇసుకను తీయవద్దని ట్రాక్టర్లను తీసుకువెళ్లిన వారితో ఏడవకు దిగారు. అక్కడే ఉన్న తనను కులం పేరుతో దూషిస్తూ దుర్భషలాడారని వీడీసీ చైర్మన్ రమేశ్ మెట్పల్లి పోలీస్ స్టేషన్లో అధికారుల ఆదేశాలతో ఇసుక తీసుకురావడానికి వెళ్లిన నలుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన తాటిపెల్లి సురేశ్ రెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కేశిరెడ్డి నవీన్ రెడ్డి, శోభపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు మెట్ పల్లి డీఎస్పీ రాములు ఆత్మకూర్కు వెళ్లి విచారణ జరిపారు. ఆయన వెంట మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్ ఉన్నారు.
విడిసి వర్సెస్ అధికారులు ఈ ఇసుక వివాదం డివిజన్లోనే అతిపెద్ద చర్చనీయాంశమయ్యింది.

