వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

వాహనదారులు
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవుట్రాఫిక్ రూల్స్ ప్రకారమే వాహనాల నడపాలి
– మెట్ పల్లి సీఐ అనిల్
– మెట్ పల్లిలో పోలీసుల విస్తృతంగా వాహన తనిఖీలు

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, జూన్ 19(ప్రజాకలం) : వాహనదారులు నిబంధన అతిక్రమించి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్క వాహనదారులు పాటించాల్సిందే అని,ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరిపైననైనా సరే శాఖపరమైన చర్యలు తప్పవని మెట్ పల్లి సీఐ అనిల్ తెలిపారు. గురువారం జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి పట్టణంలో మెట్ పల్లి సీఐ అనిల్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద మల్లాపూర్ ఎస్సై రాజు, పాత బస్టాండ్ వద్ద మెట్ పల్లి ఎస్సై కిరణ్, బస్ డిపో వద్ద ఇబ్రహీంపట్నం ఇన్చార్జి ఎస్సై రాజు నాయక్ లు వాహనాలను తనిఖీ చేశారు. మెట్ పల్లి సీఐ అనిల్ వాహనాల తనిఖీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని, మద్యం సేవించి వాహనాలు నడిపిస్తున్న వారిని గుర్తించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను పట్టుకొని కొత్త నెంబర్ ప్లేట్లు వేయించి పంపించేశారు. అనంతరం మెట్ పల్లి సీఐ అనిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని కోరారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపిస్తూ పట్టుపడితే తల్లిదండ్రుల పైన సైతం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు నంబర్ ప్లేట్ లేని వాహనాలు 116 సీజ్ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మెట్పల్లి ఎస్సైలు రాజు, రాజు నాయక్,కిరణ్ కుమార్ మరియు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )